'సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు'

VZM: కూటమిని గెలిపిస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అమలు చేయడం లేదని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం పట్టణంలో ఐటీఐ కాలనీలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమంలో ఆయన పాల్గొని, హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.