వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తహసీల్దార్

VZM: ఎస్ కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలోని గాదెల లోవ గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తహసీల్దార్ శ్రీనివాసరావు బుధవారం పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న ఏరును పరిశీలించారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల నుండి అనుమతులు కోరామని, త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని వెల్లడించారు.