లంబసింగి రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షం

ASR: చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన రహదారిలోని లంబసింగి ఘాట్ రోడ్డులో శుక్రవారం భారీ వృక్షం నేలకొరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.