ఆదోని 1టౌన్ పోలీస్ స్టేషన్లో బైక్ మాయం

ఆదోని 1టౌన్ పోలీస్ స్టేషన్లో బైక్ మాయం

KRNL: ఆదోనిలో పోలీసుల అదుపులో ఉన్న బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గతేడాది సెప్టెంబర్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో సోమశంకర్ వాహనాన్ని 1టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం తర్వాత బాధితుడు వెళ్లగా స్టేషన్లో బైక్ లేదు. ఏడు నెలలుగా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు శుక్రవారం ఎస్పీని ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.