'జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి'

'జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి'

సత్యసాయి: ఈ నెల 13న పెనుకొండ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. పెనుకొండ టీడీపీ కార్యాలయంలో జాబ్ మేళాన పోస్టర్లు విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.