ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్ దళాలు
ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఆ దేశంలోని 30కి పైగా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించాయి. తమ లక్ష్యాల్లో ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు ఉన్నాయని పేర్కొన్నాయి. అలాగే ఇరాన్ పాలకులు, సైనిక కమాండ్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పాయి.