ఎల్ఎండీకి 1,631 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

KNR: కరీంనగర్‌లోని LMDలో రోజురోజుకు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. కాకతీయ కాలువ నుంచి 1,200 క్యూసెక్కుల నీరు, మోయతుమ్మెద వాగు నుంచి 431 క్యూసెక్కులు నీరు వస్తుంది. మొత్తంగా జలాశయానికి 1,631 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. LMD పూర్తి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.516 టీఎంసీల నీరు నిల్వ ఉంది.