మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన

HNK: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం ఎదుట గ్రామస్తులు తాగునీటి ఎద్దడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేడు ఆందోళన నిర్వహించారు. రాజకీయ పార్టీలకతీతంగా మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారులు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని నినాదాలు చేశారు.