కారు, బైక్ ఢీకొని.. వ్యక్తి మృతి

కారు, బైక్ ఢీకొని.. వ్యక్తి మృతి

KMM: మధిర మండలం కృష్ణాపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సిరిపురంకు చెందిన కనకపుడి నరసింహారావు (55)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సిరిపురం నుంచి మధిర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.