దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని.. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.