అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల వద్ద నుంచి అర్జీలను శుక్రవారం స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.