VIDEO: వరి నాటు వేసిన ఎమ్మెల్యే

నారాయణపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో భారీ వర్షానికి కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేసి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె చెప్పారు.