'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి'
SRCL: బాలికలకు 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' అంశంపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం. చందన అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంపై కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించాలని ఆమె సూచించారు.