మడకశిరలో మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

సత్యసాయి: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మడకశిరలో వైసీపీ నాయకులు గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి ‘జై జగన్, జై మిథున్ రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైసీ గోవర్ధన్ రెడ్డి, ఎంజేర్ గౌడ్, కురుబ శేషాద్రి, బాలకృష్ణారెడ్డి, బాలు రెడ్డి, మొలవాయి సర్పంచ్ రంగనాథ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.