కొవ్వొత్తులతో ఘన వ్యర్ధాల నిర్వహణపై వినూత్న ర్యాలీ

PLD: రెంటచింతల మండల పరిధిలోని రెంటచింతల గ్రామంలో ఐటీసీ మరియు సెర్చ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీని ఎంపీడీఓ కార్యాలయం నుండి ఘన వ్యర్ధాల ప్రాసెయింగ్ సెంటర్ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఓ మాడెబోయిన గురు ప్రసాద్, నాగరాజు, హరిత రాయబారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.