'భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి'
ASR: గిరిజన ప్రజల ఆరాధ్య దైవం, పాడేరు మోదకొండమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. బుధవారం పాడేరులోని కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. మే నెలలో జరగనున్న జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.