ఎన్ఎస్ఎస్ జాతీయ శిబిరానికి ఎంపికైన గురుకుల విద్యార్థిని

ఎన్ఎస్ఎస్ జాతీయ శిబిరానికి ఎంపికైన గురుకుల విద్యార్థిని

NLG: దేవరకొండలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆర్. మమత ఎన్ఎస్ఎస్‌లో జాతీయ స్థాయి ఇంటిగ్రేటేడ్ శిబిరానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ మంగళవారం తెలిపారు. ఈ శిబిరం తమిళనాడులోని తంజావూరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం ఆఫీసర్లు, అభినందనలు తెలిపారు.