గాయపడిన వారిలో యువకుడు మృతి
AKP: ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు యువకులు ఏ. దిలీప్ కుమార్ (20) అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ తన స్నేహితులు ఎన్ జగన్, జితేంద్ర కుమార్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా వాహనం ఢీ కొట్టింది.