ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన రాజోలి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మాన్ దొడ్డి  పచ్చర్ల రహదారిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ సోమిరెడ్డి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయాడు. అతడికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు గమనించి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.