నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జిగా జి. రాధిక నియామకం

నిర్మల్: సీనియర్ సివిల్ జడ్జిగా జి. రాధిక బాద్యతలు స్వీకరించారు. ఈ సంధర్బంగా బార్ అసోసియేషన్ అధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఆనంతరం న్యాయవాదులు సివిల్ జడ్జిని పుష్పగుచ్చం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు.