జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన సీఎం
HYD: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అపారమైనవని, కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారన్నారు.