ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు

ELR: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ జెండాని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులకు మేయర్ నూర్జహాన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.