రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేసిన జడ్జి
నారాయణపేట మక్తల్ పట్టణాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను సీనియర్ సివిల్ జడ్జి విద్యా నాయక్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వసతులను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్‌ను పగడ్బందీగా మెయింటైన్ చేయాలన్నారు. వాష్ రూమ్స్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.