లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

BPT: లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఈరోజు జరిగింది. పీడీజీ ఎంజేఎఫ్ లయన్ సి.బాలస్వామి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా లయన్ దండే యజ్ఞనారాయణ, కార్యదర్శిగా లయన్ గణేశుల శివరామకృష్ణ, కోశాధికారిగా లయన్ బొనిగల రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.