'రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'
K RNL: రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. రైతులకు సరైన ధర లభించేలా, పంటలకు మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.