VIDEO: బైక్ చోరీ.. సీసీ టీవీలో దృశ్యాలు
కోనసీమ: కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో ఉన్న మోటార్ల రిపేర్ షాప్‌లో శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో బాధితులు కముజు సత్తిబాబు శనివారం కాట్రేనికోన పోలీసులు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారాన్ని అతను పోలీసులకు అందజేశాడు. ఎస్‌ఐ అవినాష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.