జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..!
ELR: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. తరువాత పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నల్లమాడులో జరిగే ప్రజావేదికలో పాల్గొననున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.