లెనిన్ జయంతి ఉత్సవాలు నిర్వహించిన సీపీఐ

లెనిన్ జయంతి ఉత్సవాలు నిర్వహించిన సీపీఐ

VSP: సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో లెనిన్ 156వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎస్‌కే రహిమాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ శ్రామిక వర్గానికి సోషలిస్టు సిద్ధాంతాన్ని పరిచయం చేసి 1917లో రష్యాలో తొలి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు.