ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

KNR: కొత్తపల్లి మండలంలో ప్రపంచ వీడియో, ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అంతరించిపోతున్న వ్యవస్థలను భద్రపరిచే గొప్ప పనిని ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారని తెలిపారు. ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటో , వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.