VIDEO: 'దేవాలయ కార్యక్రమాల్లో రాజకీయాలు బాధాకరం'
NLG: దేవాలయ కార్యక్రమాల్లో రాజకీయాలు చేయటం సరైనది కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ లోని శివాలయంలో శివ స్వాముల 20వ మండల పడిపూజ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేగా సేవలందించిన తన పేరును కరపత్రంలో చేర్చకుండా రాజకీయాలు చేయటం బాధాకరమన్నారు