వివాహిత అదృశ్యం... కేసు నమోదు

వివాహిత అదృశ్యం... కేసు నమోదు

E.G: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు సిఐ విశ్వం తెలిపారు. ఆయన వివరాల మేరకు కొవ్వూరులోని మెరక వీధికి చెందిన నాగిరెడ్డి సత్యదేవసేన (22) ఈనెల 11వ తేదీన విక్టరీ బజార్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి తిరిగి రాలేదు. దీంతో భర్త మణి వెంకట సత్యనారాయణ ఆమె కోసం ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.