యమునా నది ఉధృతి.. ఢిల్లీలో హై అలర్ట్

యమునా నది ఉధృతి.. ఢిల్లీలో హై అలర్ట్

ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు యమునా పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెస్క్యూ టీమ్‌లు 30 పడవలలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. యమునా ఉధృతి వల్ల ఢిల్లీలోని 20 గ్రామాలపై వరద ప్రభావం పడే అవకాశమున్నట్లు తెలిపారు.