శ్రీకాళహస్తిలో అవినీతి.. భక్తురాలి సెల్ఫీ వీడియో వైరల్!
CTR: శ్రీకాళహస్తి క్షేత్రంలో అవినీతిపై ఓ భక్తురాలు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. త్వరగా దర్శనం చేయిస్తానంటూ ఓ పోలీస్ అధికారి రూ.300 అడిగారని, గుడిలో అడుగడుగునా సిబ్బంది రూ.50, రూ.100 అంటూ చేయి చాస్తున్నారని మండిపడ్డారు. వీరికి జీతాలు రావా? పవిత్రమైన ఆలయంలో ఇలా చేయడం తగునా? అని ఆమె ప్రశ్నించారు. ఈ చేదు అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ వీడియోలో తెలిపింది.