కలెక్టర్ షణ్మోహన్ కీలక ఆదేశాలు

కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధిత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని శుక్రవారం అధికారులకు సూచించారు. పీసీపీఎన్డీటీ చట్టంపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టోల్ ఫ్రీ, వాట్సాప్ నెంబర్ల గోడపత్రికను ఆవిష్కరించారు.