పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
NGKL: పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బండగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షలను విజయవంతం చేసేలా సంబంధిత అధికారులు పని చేయాలని సూచించారు.