దసరా ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KKD: రౌతులపూడిలో శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా నవరాత్రుల ఉత్సవాల పోస్టర్‌ను శనివారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.