'వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిడివల్లే మా అన్న చనిపోయాడు'

'వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిడివల్లే మా అన్న చనిపోయాడు'

KDP: చెన్నారెడ్డి ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారస్తులే కారణమని మృతుడి సోదరి గంగాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పులివెందులలో ఆమె మాట్లాడుతూ.. వడ్డీ వ్యాపారస్తుల తీవ్ర ఒత్తిడివల్లే తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడని, వడ్డీ వ్యాపారస్తులు కావాలనే అవమానించారని వాపోయింది. ఆయన ఇంట్లో లేని సమయంలో ఆడవాళ్లు ఉన్నప్పటికీ వడ్డీ వ్యాపారస్తులు డబ్బుల కోసం కాపు కాశారని తెలిపారు.