జన గణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
సూర్యాపేటలో జన గణన-2027 శిక్షణను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. న్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు దిశానిర్దేశం చేస్తూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను CMMS పోర్టల్‌లో పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆశా వర్కర్లతో గ్రామ ఆరోగ్య పరిస్థితులపై సమీక్షించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.