పోగాకు ఉత్పత్తులపై సదస్సు
W.G: భీమవరం MRO ఆఫీస్ ఆవరణంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సదస్సు విజ్ఞాన వేదిక బుధవారం నిర్వహించింది. డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తులైన బీడీ, సిగరెట్, చుట్టలతో గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. ఈ సందర్భంగా వారు పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలని తెలిపారు.