VIDEO: 'విగ్రహాల తయారీలో జాగ్రత్తలు పాటించాలి'

VIDEO: 'విగ్రహాల తయారీలో జాగ్రత్తలు పాటించాలి'

WGL: గణపతి విగ్రహాలు తయారుచేసేటప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు పాటించాలని వరంగల్ డీఈ బిక్షపతి సూచించారు. రాబోయే వినాయకచవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చేసుకోవాలని అన్నారు. బుధవారం ఆయన సిబ్బందితో కలిసి వర్ధన్నపేట పట్టణంలో విగ్రహాల తయారు చేసే ప్రదేశాలను పర్యవేక్షించారు. ప్రమాదకరంగా ఉన్న కేబుల్స్ వైర్లను తొలగింపజేశారు.