పౌష్టికాహారం పిల్లలకు తగిన మోతాదులో అందించాలి

ప్రకాశం: పామూరు మండలంలోని వెంకటాపురం అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్ గొళ్ళ పద్మజ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు సీఎం జగన్ అందిస్తున్న పౌష్టికాహారంను ఏ మోతాదులో ఎలా తీసుకోవాలని తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆదాంబి, మహిళా పోలీస్ షేక్ షాన్వాజ్ ఉన్నారు.