కేసరపల్లి బ్రిడ్జి వద్ద బ్యారికేడ్లు

కేసరపల్లి బ్రిడ్జి వద్ద బ్యారికేడ్లు

కృష్ణా: గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వాస పెద్ది రాజు ఆధ్వర్యంలో కేసరపల్లి బ్రిడ్జి వద్ద గురువారం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల వరదలతో బుడమేరు కాలువలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండటంతో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాహనాలపై రాకపోకలు సాగించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.