VIDEO: తరుగు లేకుండా ధాన్యం సేకరించాలి: MLA గండ్ర
BHPL: రేగొండ మండలం రూపురెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తరుగు లేకుండా ధాన్యం సేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు ధాన్యం అమ్ముకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోకూడదని సూచించారు.