'పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

ATP: సింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్‌ను ఆదివారం ఆయన నివాసంలో బ్రహ్మసముద్రం మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శైలజనాథ్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వైసీపీ పార్టీను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైసీపీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.