కోటబొమ్మాళిలో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన

శ్రీకాకుళం: కోటబొమ్మాళి కేంద్రంలోని కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను డీపీఓ కె. సౌజన్య భారతీ మంగళవారం పరిశీలించారు. ముందస్తు చర్యలలో భాగంగా ప్రణాళికలు చేసుకొని పనులు చేపట్టాలని కార్యదర్శి సూచించారు. జాతర సందర్భంగా ఎక్కడ అపారిశుద్ధ్య ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఐ.వి రమణ, డిప్యూటీ ఎంపీడీఓ జె. ఆనందరావు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.