గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు
BPT: బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో శుక్రవారం ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజేష్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు చెప్పారు. బండను క్రేన్‌తో ఎత్తే సమయంలో క్రేన్ ఉక్కుకు ఉన్న గొలుసు తెగిపోవడం వల్ల ప్రమాదం జరిగింది.