ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య

తిరుపతి: జిల్లాలోని పుత్తూరు కృష్ణానగర్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చిన్నారులు తేజ, లాస్యగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ తన జీవితం గుణపాఠం కావాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.