నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జిల్లా వాసి మృతి

ప్రకాశం: నరసరావుపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పాతమాగులూరు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో అతన్ని స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.