ప్లాంటేషన్‌లో ఉన్న మొక్కలను సంరక్షించాలి

ప్లాంటేషన్‌లో ఉన్న మొక్కలను సంరక్షించాలి

KMM: ఖమ్మంలోని డంపింగ్ యార్డ్ ప్లాంటేషన్‌లో ఉన్న మొక్కలను సంరక్షించాలని హార్టికల్చర్ ఆఫీసర్ బీ.రాధిక అన్నారు. శుక్రవారం ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కల పెరుగుదల, వాటి సంరక్షణ, నీటి సరఫరా వంటి అంశాలను సమీక్షించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పర్యావరణ హితానికి అనుగుణంగా మొక్కలను సంరక్షిస్తూ, మరింత హరిత వాతావరణం ఏర్పరచేందుకు అవసరమైన సూచనలు అందించారు.