పది పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!
ELR: ఉంగుటూరు మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 702 మంది విద్యార్థులకు గాను 675 మంది హాజరయ్యారని, 27 మంది గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖాధికారి-1 సాయిబాబా తెలిపారు. మండలంలో ఐదు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు.